News

తెలంగాణ హోంగార్డు జీతం 12 వేలు


తెలంగాణ్‌లో ఇంతకాలం చాలీచాలని జీతాలతో నెట్టుకొచ్చిన హోంగార్డులకు సర్కారు తీపి కబురు వినిపించింది. సీఎం కేసీఆర్‌ హామీ మేరకు.. వారంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జీతం ఎట్టకేలకు పెరిగింది. హోంగార్డులకు ప్రస్తుతం అందిస్తున్న రోజువారీ గౌరవ వేతనాన్ని రూ.300 నుంచి 400కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటిదాకా నెలకు రూ.9 వేల గౌరవ వేతనమున్న హోంగార్డులకు ఇకపై రూ.12 వేలు అందనుంది. గౌరవ వేతనంతోపాటుగా ఏడాదికి ఒక్కటే యూనిఫాం అలవెన్సు ఉండగా దానికి తోడుగా మరో జత యూనిఫాం అలవెన్సును ప్రభుత్వం కల్పించింది. పెరేడ్‌ అలవెన్సును రూ. 100కు పెంచింది. ప్రభుత్వం తమ రోజువారీ గౌరవ వేతనాన్ని పెంచడం పట్ల తెలంగాణ హోంగార్డుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజేందర్‌ హర్షం వ్యక్తం చేశారు. తమ జీతం పెంపుదలకు కృషి చేసిన డీజీపీ అనురాగ్‌శర్మతో పాటు, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు